తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన ఓ ప్రముఖ జర్నలిస్టు.

తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన ఓ ప్రముఖ జర్నలిస్టు. ఈ పలుకు, ఆ పలుకు అంటూ అందరినీ చెడమడా వాయించేస్తాడు. అందరినీ అంటే అందరినీ కాదండి. ఆయనకు నచ్చినవారిని ఆకాశానికి ఎత్తేస్తాడు.. నచ్చకపోతే ఎత్తిపడేస్తాడు. ఇష్టమైన రాజకీయనాయకులను భుజానికి ఎత్తుకుంటాడు.. ఇష్టం లేనివారిని ఏకిపారేస్తాడు. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్లు తన శత్రువును ఎవరైనా విమర్శిస్తే వెంటనే వారికి 'హార్ట్‌' ఇస్తాడు.. తన శత్రువును ఎవరైనా పొగిడితే వెంటనే 'హ్యాండ్‌' ఇస్తాడు. నచ్చనివాళ్లని తాటి చెక్కతో బాదేస్తాడు.. నచ్చినవాళ్లను సుతిమెత్తగా తమలపాకుతో వాయించినట్లు టచ్‌ చేసి వదిలేస్తాడు. అయితే ఈ ప్రముఖ జర్నలిస్ట్‌ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ఆయన ఇప్పుడు ఒకరిని గాఢంగా ప్రేమిస్తున్నాడట. ఆమె చేతిలో చేయి వేసి, మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడవాలని తహతహలాడుతున్నాడట. ఓ మహిళా వైద్యురాలితో ప్రేమలో పడ్డాడని.. ఆ మహిళ కోసం విరహవేదన అనుభవిస్తున్నాడని వార్త వైరలవుతోంది. ప్రేమ ముదిరి పాకాన పడటంతో ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడిందట. పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారని వినికిడి. దీంతో వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో కూడా రచ్చ జరిగిందని తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ త్వరలోనే వీరి ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా ఉందట.

Updated On
ehatv

ehatv

Next Story