నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలన్న టీడీపీ నేతలు, కార్యకర్తల డిమాండ్‌ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుబట్టారు.

నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలన్న టీడీపీ నేతలు, కార్యకర్తల డిమాండ్‌ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుబట్టారు. లోకేష్‌ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేయడానికి తాము ఎవరని ఆయన అన్నారు. డిప్యూటీసీఎం కావాలని ప్రజల నుంచి డిమాండ్‌ రావాలన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయస్తారని అయన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరిగిన సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్‌ను ఆ పార్టీ ఎంపీ టీజీ భరత్ భూజానికెత్తుకున్నారు. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నారా లోకేష్‌ భవిష్యత్‌ ముఖ్యమంత్రి అంటూ కుండబద్ధలు కొట్టారు. అచ్చెంన్నాయుడు కూడా ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేషే చంద్రబాబు వారసడన్నారు. దీంతో టీడీపీ నేతలకు మరింత బలం చేకూరింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహా పలువురు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వాదనలకు జనసేన కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని. .అయితే ముఖ్యమంత్రిగా మాత్రం పవన్‌ను చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని అడగడానికి మనం ఎవరు.. అడిగితే ప్రజలు అడగాలని మనం ఎవరమని ఆయన అన్న వ్యాఖ్యలపై పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ehatv

ehatv

Next Story