ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని నియమించబోతున్నట్లు సమాచారం. పలువురు సీనియర్ల పేర్లు వినిపించినప్పటికీ.. చివరకు అయ్యన్న వైపే అధిష్టానం మొగ్గుచూపించినట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్‌ పదవి జనసేనకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయ్యన్నపాత్రుడు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో వైసీపీ స్పీకర్‌ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించగా.. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం కూడా బీసీ సామాజిక వర్గానికి ఆ పదవిని కేటాయించింది.

డిప్యూటీ స్పీకర్‌ పదవి జనసేన నుంచి నెల్లిమర్ల(విజయనగరం) శాసనసభ సభ్యురాలు మాధవి లోకం పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.


Updated On
Eha Tv

Eha Tv

Next Story