బాలకృష్ణకు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కబోతుందా. ఆ దిశగా అడుగులు పడుతున్నాయా. సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బాలకృష్ణకు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కబోతుందా. ఆ దిశగా అడుగులు పడుతున్నాయా. సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 లో చంద్రబాబు మంత్రివర్గంలో బాలయ్యకు స్థానం దక్కలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చంద్రబాబు మంత్రి పదవికి ఇవ్వలేకపోయారు. ఈసారైనా బాలకృష్ణకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకుగా, పార్టీ సీనియర్ నేతగా ఉన్న బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు అడుగుతున్నారు. ఈ సందర్భంగా హిందూపురంలో బాలకృష్ణ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాలయ్యకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story