Bangladesh vs Sri Lanka : ఎట్టకేలకు విజయం సాధించిన బంగ్లాదేశ్
2023 ప్రపంచ కప్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బంగ్లాదేశ్.. నిన్న శ్రీలంకను 3 వికెట్ల తేడాతో ఓడించింది. బంగ్లాదేశ్ జట్టు విజయంతో మూడు జట్లు సెమీఫైనల్ రేసుకు దూరమయ్యాయి.

Bangladesh won by 3 wkts against Srilanka
2023 ప్రపంచ కప్(World Cup)లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బంగ్లాదేశ్(Bangladesh).. నిన్న శ్రీలంక(Srilanka)ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. బంగ్లాదేశ్ జట్టు విజయంతో మూడు జట్లు సెమీఫైనల్ రేసుకు దూరమయ్యాయి. బంగ్లాదేశ్, ఇంగ్లండ్(England)లు ఇప్పటికే సెమీఫైనల్(Semi Final) రేసుకు దూరమయ్యాయి. ఇప్పుడు శ్రీలంక కూడా అధికారికంగా చివరి రేసుకు దూరంగా ఉంది. ప్రస్తుత టోర్నీలో శ్రీలంకకు ఇది ఆరో ఓటమి. ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ తొలిసారిగా శ్రీలంకను ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. చరిత్ అసలంక 105 బంతుల్లో 108 పరుగులతో అద్భుతమైన సెంచరీ ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తాంజిమ్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ అల్ హసన్, షోరిఫుల్ ఇస్లాం చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
280 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టులో నజ్ముల్ హసన్ శాంటో 90, షకీబ్ అల్ హసన్ 82 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లు తీవ్రంగా శ్రమించినా.. మిడిల్ ఓవర్లలో షకీబ్, శాంటో మధ్య భాగస్వామ్యాన్ని(169 పరుగులు) విడగొట్టలేకపోయారు. శ్రీలంక తరఫున ఈ మ్యాచ్‌లో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు పడగొట్టాడు. మహిష్ తిక్షణా, ఏంజెలో మాథ్యూస్ చెరో 2 వికెట్లు తీశారు.
