Bhumana Abhinay : కూటమి హామీల అమలు తీరుపై తిరుపతిలో వెబ్ పేజీతో నిరసన..!
చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలు చేయడంలో విఫలమైందంటూ తిరుపతిలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూమన అభినయ్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామునే వినూత్నంగా ప్రచారం చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలు చేయడంలో విఫలమైందంటూ తిరుపతిలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూమన అభినయ్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామునే వినూత్నంగా ప్రచారం చేశారు. ఇప్పటికే అభినయ్ (Bhumana Abhinay)సారథ్యంలో విద్యుత్ బిల్లుల పెంపుపై ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ వీధినాటకాన్ని ప్రదర్శించారు. తాజాగా తిరుపతి(Tirupati)లో మూడో డివిజన్‌లో లెనిన్ నగర్‌లో ఇంటింటికి అభినయ్‌తో పాటు వైసీపీ కార్యకర్తలు వెళ్లారు. గతంలో జగన్(Ys jagan) పాలనకు, పది నెలల చంద్రబాబు పాలన మధ్య తేడాను ప్రజలతోనే చెప్పించారు. సూపర్‌సిక్స్ (Super Six)పథకాల్లో ఏవేవి అందుతున్నాయో చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. ఒక్కో కుటుంబంతో కనీసం అరగంటకు పైగా ఆయన మాట్లాడుతూ, వివరాలు తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు(Cm Chandrababu) ఘరానా మోసం పేరుతో ఒక వెబ్ పేజీని క్రియేట్ చేసి, అందులో సూపర్ సిక్స్ పథకాలు, లబ్ధి కలిగిందా? లేదా? అనే వివరాలను పొందుపరిచి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ వెబ్ పేజీలోకి వెళ్లి, కుటుంబ యజమాని పేరు, సంఃక్షేమ పథకాల వివరాలు, లబ్ధి పొందారా? లేదా?… ఆ వివరాలను అందులో చేరిస్తే… పది నెలల్లో ఒక్కో కుటుంబానికి చంద్రబాబు ప్రభుత్వం ఏంచేసిందో తెలుసుకోవచ్చు. అభినయ్ మూడు ఇళ్లకు వివరాలు కోరగా ఒక కుటుంబానికి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్, అది కూడా పది నెలలకు ఒకటి మాత్రమే దక్కినట్టు వారు వివరించారు.
దీంతో పది నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నష్టాన్ని వాళ్ల కళ్లెదుటే, వెబ్‌పేజీలో అర్హులైన వాళ్లతోనే లెక్కవేయించడం వైసీపీ (Ycp)శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ వెబ్ పేజీని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎవరైనా తాము నష్టపోయిన సొమ్మెంతో తెలుసుకోవచ్చని అభినయ్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇదే సందర్భంలో గత వైసీపీ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని ఆయన ప్రజలు వివరించారు. జగన్ ఇచ్చిన మాటపై నిలబడగా, చంద్రబాబు తప్పాడని జనంతోనే అభినయ్ చెప్పించడం వినూత్న ప్రయోగమంటున్నాయి వైసీపీ శ్రేణులు. మరీ ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ప్రజలు తమకు తాముగా చంద్రబాబు సర్కార్ పాలనలో నష్టపోయిందేంటో తెలుసుకునేలా చేయడాన్ని రాష్ట్రమంతా వైసీపీ చేపడితే, ఆ పార్టీకి రాజకీయంగా ఎంతో మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
