ధర్మవరం(Dharmavaram) సబ్‌జైలు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ధర్మవరం(Dharmavaram) సబ్‌జైలు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP)కార్యకర్తలను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(KethiReddy Venkata Ram Reddy) సబ్‌జైలు దగ్గరకు వచ్చారు. సబ్‌ జైలు దగ్గర వైసీపీ(YCP)కార్యకర్తలకు బీజేపీ(BJP) కార్యకర్తలు ఎదురుపడ్డారు. అదే సమయంలో కేతిరెడ్డి కారును బీజేపీ, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కేతిరెడ్డి కారుపైకి ఓ కార్యకర్త ఎక్కి గలాటా చేయడంతో కారును డ్రైవర్‌ వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. దాంతో కారుపై నుంచి కార్యకర్త కిందపడ్డాడు. అతడికి స్వల్ప గాయాలయ్యాయి.

Updated On
ehatv

ehatv

Next Story