ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలం పుంజుకుంటున్న బీజేపీ పార్టీ

మూడో స్థానంలోకి ఎగబాగుతున్న కమలం

మంత్రి పదవికి అంకితం అయిపోయిన పవన్ కళ్యాణ్

ఎటు తెలుసుకోలేకపోతున్న జనసేన క్యాడర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు దగ్గరవుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు

వచ్చే జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి కచ్చితంగా సంవత్సరం కావస్తుంది. ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషణకులు రాజకీయ అనుభవ వ్యక్తులు ద్వారా తెలుసుకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాష్ట్రంలో బిజెపి పార్టీ మూడో స్థానానికి ఎగబాగుతుందని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి గ్రామం నుండి కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం గ్రామం నుండి కార్యకర్తలకు సంబంధించి పదవులు ఇవ్వడం ప్రతి నెలలో కూడా సమావేశాలు నిర్వహించడం బిజెపి పార్టీ గురించి ప్రభుత్వం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేది పరిపాటిగా మారింది. ముఖ్యంగా బిజెపి పార్టీలోకి కార్యకర్తలు నాయకులు చేరడానికి ఇది ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. గతంలో మండలాలకే పరిమితమైన బిజెపి పార్టీ ఈరోజు ఏకంగా గ్రామాలలోకి చొచ్చుకొని పోతుంది.

ఇక జనసేన పార్టీ గురించి ప్రతి గ్రామం నుండి కూడా కార్యకర్తలు ఉన్నప్పటికీ ఎలాంటి గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గస్థాయి కమిటీలు ఏర్పాటు చేయకుండా ఇప్పటికి కూడా ఇంకా పార్టీ కోసం పని చేయాలంటూ మాట్లాడుతున్న తరుణంలో ఎంతోమంది పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నప్పటికీ బయటకు మాత్రం చెప్పుకోలేకపోతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు ఏకంగా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP)నాయకుల ప్రొఫైల్ పెట్టుకుని మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారా అనే విధంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీ కార్యక్రమాలు కంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం లేదంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎంతమంది నాయకులు జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ తమ సొంత నగదుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి నియోజక స్థాయిలో ఎలాంటి పదవులు అనుభవించకుండా మౌనం వహిస్తూ ఏం చేయాలో అర్థం కాక సొంత పనులు కూడా చేసుకోలేక స్థానిక ఎమ్మెల్యే ని అడగలేక ఎంతమంది ఆవేదనలో ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు కూడా తమను పిలవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం మండలల్లో ఐనా అసలు పదవులను దక్కుతాయా లేదా అంటూ పక్కవాళ్లకు చెప్పుకొని బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని నియోజకవర్గాలలో ఏకంగా జనసేన పార్టీ నాయకులను దగ్గర కూడా రానివ్వడం లేదంటూ మాటలు వినిపిస్తున్న అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదు.

ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూసుకుంటే మంత్రి పదవికి అంకితమయ్యారంటూ క్యాడర్ కు పదవులు ఇప్పించుకోవడంలో విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంవత్సరం కావస్తున్నప్పటికీ మరి గ్రామాలలో మండలాలలో నియోజకవర్గాలలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయకుండా ఇంకా పార్టీని బలోపేతం చేయకుండా పార్టీ అధినాయకుడే ఏకంగా మరో 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ముఖ్యమంత్రిగా ఉంటారంటూ మాట్లాడుతుంటే జనసేన పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో కొంత అసహనం ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక పార్టీ కోసం నమ్ముకొని కార్యకర్త నాయకుడు వచ్చినప్పుడు మీకు నేను అండగా ఉంటాను నేను సీఎం అభ్యర్థిగా ఉంటాను అని చెప్పడం పోయి పక్క పార్టీకి ఇంకా మనం పని చేయాలని చెబుతుంటే ఎవరికైనా అసహనం అనేది రాదా అంటూ స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తన ధోరణి మార్చుకోవాలని గ్రామస్థాయి నుండి సమావేశాలు నిర్వహించి 175 నియోజకవర్గాల్లో తన కాండేట్లను నిలబెట్టుకునే విధంగా పనిచేయాలని రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలబడాలని తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీని బలంగా నిలబెట్టాలని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా పక్క పార్టీతో ఉండాలంటూ లో లోపల జనసేన పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే కచ్చితంగా రెండు నర ఏళ్ళు సంవత్సరాలు సీఎం పదవి ఉండాలని తమకి పదవులు రావాలని ప్రజల సమస్యలు తీర్చాలని మాకు ఉండదా అంటూ జనసేన పార్టీ నాయకులు కుమిలిపోతున్నారు.

ఒకపక్క బీజేపీ (BJP)పార్టీ చాప కింద నీరు లాగా ప్రవహిస్తూ పోతూ ఉంటే జనసేన పార్టీ(Janasena) మాత్రం నీరుగారి పోతుంది అంటూ ప్రజలు మాట్లాడుతున్నారు. పార్టీ అనేది గ్రామస్థాయి నుండి ఉంటేనే ఎప్పటికైనా విజయం సాధిస్తాం అంటూ పార్టీ నాయకులు మారుతున్నప్పటికీ ఈ విషయంపై అధిష్టానం సీరియస్ గా తీసుకోవడంతో రేపు రాబోయే రోజుల్లో ఎంతమంది జనసేన పార్టీ కెళ్ళి పని చేస్తారంటూ పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధిష్టానం గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని రేపు రాబోయే రోజుల్లో సీఎం పదవికి పోటీ చేసే విధంగా పనిచేయాలని 175 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున గెలవాలంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.

ehatv

ehatv

Next Story