ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. అయితే టీడీపీ కూడా ఆ అవకాశం ఇవ్వకూడదని సిద్ధమైంది

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. అయితే టీడీపీ కూడా ఆ అవకాశం ఇవ్వకూడదని సిద్ధమైంది. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఇప్పటికే భేటీ అయ్యారు.. నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కౌన్సిలర్లతో సమవేశమయ్యారు. కూటమి అభ్యర్థి ఎంపికపై ఇంకా క్లారిటీ రాలేదు. బొత్స సత్యనారాయణ.. 12వ తేదీన నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమకు బలం ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో మోసం చేసి గెలవాలని కూటమి నేతలు సిద్ధమయ్యారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. బలం లేకపోయినా ప్రలోభాలతో కూటమి నేతలు గెలవాలని చూస్తున్నారన్నారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story