Jagan Case: జగన్మోహన్‌రెడ్డిపై కేసు..!

ఆంధ్రప్రదేష్‌లో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించిన ప్రాజెక్ట్ ని అప్పుడున్న పరిస్థితిలో మేము కట్టలేము అంటూ పక్కన పెట్టేసింది, లక్ష కోట్ల రూపాయలు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది, ఆంధ్రప్రదేష్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్టి లక్ష రూపాయలు మేము అక్కడ ఖర్చు పెట్టలేము, పాయింట్ నెంబర్ వన్, పాయింట్ నెంబర్ టూ అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, పాయింట్ నెంబర్ త్రీ మొత్తం సంపద అంతా అక్కడే పెడితే ఎలా, మూడు రాజధానులు చేయాలనుకుంటున్నాం దానికోసం న్యాయ రాజధాని, శాసన రాజధాని ఆ కార్యనిర్వాహక రాజధాని, మూడు చేస్తామంటూ అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ చెప్పింది. దానికి సంబంధించిన బిల్లు పెట్టింది అసెంబ్లీలో, మళ్ళీ ఆ బిల్ ని వెనక్కి తీసుకుంది, ప్రస్తుతానికి అమరావతి రాజధానిగా ఉంది. అమరావతిని ఎందుకు డెవలప్ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనుకుందంట, అంటే యస్ ఫర్ తెలుగుదేశం పార్టీ అమరావతిలో నిర్మాణాలు చేయడానికి సంబంధించి అప్పుడు సింగపూర్ సంస్థ, అమరావతిలో నిర్మాణాలు చేయడానికి, సింగపూర్ ప్రభుత్వం ముందుకు వస్తే, సింగపూర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి లంచం అడిగారంట, సింగపూర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి లంచం అడిగాడు కాబట్టి సో లంచం ఇచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంగీకరించలేదంట, సో లంచం ఇవ్వడానికి సింగపూర్ సర్కార్ అంగీకరించలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసాడు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరొక దేశ దేశాన్ని, కేంద్ర ప్రభుత్వం అంటే, దేశాన్ని కదా మరొక దేశాన్ని లంచం అడిగారు, లంచం అడిగితే, లంచం ఇవ్వలేదు కాబట్టి మా దేశంలో, మా రాష్ట్రంలో మా రాజధాని మీరు కట్టొద్దు అంటే పక్కన పెట్టేశారు, దాని కోసం రాజధాని పూర్తిగా ఆపేశారు, ఇది నేను చెప్తున్న కథ కాదు, కఠోర నిజం తెలుగుదేశం పార్టీ దృష్టిలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ Twitter హ్యాండిల్ లో కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ వేసింది, 2014-19 మధ్య రాష్ట్ర రాజధాని అమరావతికి ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చి, పెట్టుబడులు పెట్టి, పనులు మొదలుపెట్టడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. 2019లో జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్ గా నాకు ఒక 143 కోట్ల రూపాయలు ఇస్తే పనులు సాగుతాయని ప్రేమ సందేశాన్ని పంపించారంట అమరావతి సింగపూర్ ప్రాజెక్ట్ లో జగన్ అడిగిన అడ్వాన్స్ ఇవ్వలేదని, ఆపేసిన దుర్మార్గం తెలిసి, నేడు సింగపూర్లో పర్యటిస్తున్న మన బృందం, నిశ్చేత్తులు అయ్యారంట. అమరావతికి సంబంధించిన ప్రాజెక్టులో పనులు జరగాలంటే 143 కోట్ల రూపాయలు నాకు ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి అడిగితే ఇవ్వలేదు, కాబట్టే సింగపూర్ సంస్థ వెనక్కి పోయింది, అనే విషయం ప్రస్తుతం సింగపూర్లో పర్యటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ బృందానికి అంటే ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం అక్కడ ఉంది, ఆ బృందానికి ఇది తెలిసి ఒక్కసారిగా నిర్ఘాంత పోయారంట. ఇదే అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

ehatv

ehatv

Next Story