Chandrababu At High court : కోర్టుకు చేరుకున్న సిద్ధార్ద్ లూథ్రా, పొనవోలు సుధాకర్ రెడ్డి
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(Skill Development Scam) లో చంద్రబాబు అరెస్టైన(chandrababu Arrest) సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన విచారణ నేడు హైకోర్టులో(High Court) జరుగనుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టుకు చేరుకున్నారు.

Chandrababu At High court
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(Skill Development Scam) లో చంద్రబాబు అరెస్టైన(chandrababu Arrest) సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన విచారణ నేడు హైకోర్టులో(High Court) జరుగనుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు తరుపున వాదనలు వినిస్తున్న సిద్దార్ద్ లూథ్రాతో(Siddharth Luthra) పాటు ఇతర న్యాయవాదులు హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. అలాగే సీఐడీ తరుపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొనవోలు సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy) కూడా హైకోర్టుకు చేరుకున్నారు.
ఇదిలావుంటే.. హైకోర్టులో నేడు పలు పిటీషన్లపై విచారణ జరుగనుండగా.. ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలనే.. బాబు న్యాయవాదుల పిటిషన్ పై విచారణ జరుగనుంది. అలాగే.. ఏసీబీ న్యాయమూర్తి ఇచ్చిన కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో చంద్రబాబు న్యాయవాదుల పిటిషన్ కూడా విచారణకు రానున్నట్లు సమాచారం. వీటితో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్ పై కూడా విచారణ జరుగనుంది.
