Singapore: సింగపూర్‌లో జగన్ జపమే..!
ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్‌గా కూటమి సర్కారు ఏం చేయాలని ప్రజలు కోరుకున్నారు, ఏం చేస్తుందని ఆశించారంటే అంతకుముందు 10 ఇయర్స్‌లో చెప్పినట్టుగా, ఏపీ అంటే అమరావతి, పోలవరమే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఏపీ మాకు ప్రయారిటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారు, సో సోమవారం పోలవరం అంటూ ఓ ఐదేళ్ల కాలం రకరకాల ప్రచారం జరిగింది, ప్రజలని అక్కడికి తీసుకెళ్లి పోలవరం పురోగతిని చూపించే ప్రయత్నం చేశారు, ప్రజల్ని బస్సులో తీసుకెళ్లి అమరావతి పురోగతిని చూపించే ప్రయత్నం చేశారు, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించిన హడావిడి కనబడుతుంది తప్ప, పోలవరం సోమవారం ఏమైందో తెలియని పరిస్థితి ఉంది. అది పక్కన పెడితే సరే అమరావతి గురించి మాట్లాడితే, అమరావతికి ఏం చేస్తున్నారు, అమరావతిలో ఏం జరగబోతుంది, అమరావతిలో నిర్మాణం పూర్తఅవ్వబోతుందా, అమరావతి ఫుల్‌ఫిల్ కాకపోతుందా, కాబోతుందా అమరావతి అనే ఒక డిజైర్ అంటే, అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ప్రజలు గ్యారెంటీగా చేస్తారు, కానీ బాబుగారుని ఈరోజు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత. సరిగ్గా 12 నెలలు దాటింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ 12 నెలల తర్వాత అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి తట్టెడు మట్టేశారా అంటే, తట్టెడు కాదు చాలా వేశారని చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం కూడా లేదు, గతంలో ఉన్న భవనాలకు మళ్ళీ శంకుస్థాపనల పేరుతో శంకు స్థాపనలు చేసి, వాటికి రిపేర్లనో లేకపోతే ఆపేసిన భవనాలు మళ్ళీ మొదలు పెడతామనో చెప్తున్నారు, కంచెలు కొట్టేస్తున్నారు, కోట్లు ఖర్చు చేస్తున్నారు తప్ప, ఆ డెవలప్మెంట్ కనిపించట్లే, స్పీడ్ కనిపించట్లే, ఐదేళ్లలో కనీసం 30% అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామనే ధైర్యం, ప్రభుత్వంలో కనపడట్లా, చేస్తారనే నమ్మకం ప్రజల్లో కూడా ఏమాత్రం కనపడట్లే, మళ్ళీ ప్రకటనలే కనపడుతున్నాయి, క్వాంటం వ్యాలీ అంటున్నారు, ఏఐ సిటీ అంటున్నారు, డ్రోన్ సిటీ అంటున్నారు, ఇంకేదో ఇంకేదో అంటున్నారు, క్వాంటం సిటీ మాదిరి బాబు మీది కాదు, అని కర్ణాటక నిన్నటి నుంచి గొడవ పెడుతుంది. అసలు అమరావతి ఏంటి నవనగరాలు అన్నారు, ఇవి కాకుండా రోజుక ఒక డైలాగ్స్, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తరహాలో స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి, తప్ప వాస్తవ రూపం ఉందా అంటే కనిపించట్లే, ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
