చంద్రబాబు నాయుడు(chandrababu) జైలు నుంచి విడుదలై సరిగ్గా ఈరోజుతో ఏడాది పూర్తయింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill development case) అరెస్టయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu) జైలు నుంచి విడుదలై సరిగ్గా ఈరోజుతో ఏడాది పూర్తయింది.

అక్టోబర్‌ 31, 2023 మంగళవారం సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు(Jail) నుంచి బయటకు ఆయన వచ్చారు. చంద్రబాబును జైలులో 52 రోజుల పాటు ఉంచడంతో, సరిగా ఎన్నికలకు ముందే ఆయనను అరెస్ట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మారిపోయయి. చంద్రబాబును అరెస్టును తీవ్రంగా ఖండించిన పవన్‌ కల్యాణ్‌ ఆయనను పరామర్శించేందుకు వెళ్లి జైలు నుంచే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయానికి వచ్చాయి. అంతేకాకుండా బీజేపీతో పొత్తులో పవన్‌ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. బీజేపీతో పొత్తు కోసం ప్రధానమంత్రి మోడీని, హోంమంత్రి అమిత్‌ షాను పవన్‌ కల్యాణ్ ఒప్పించారు. మూడు పార్టీల పొత్తు వికసించడంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 175 స్థానాలకుగాను 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి కూడా కేంద్రం సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో నితీష్‌కుమార్, చంద్రబాబు కీలకంగా మారారు. పలువురు టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి పదవులు పొందారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం, 52 రోజులపాటు జైలులో ఉంచి జగన్‌ ఆయన నెత్తిపై పాలుపోశారని రాజకీయంగా విశ్లేషిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story