విజయవాడకు(Vijayawada) చెందిన చంద్రశేఖర్ సింగ్ నగర్‌లో(Chandrashkear singh nagar) డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది.

విజయవాడకు(Vijayawada) చెందిన చంద్రశేఖర్ సింగ్ నగర్‌లో(Chandrashkear singh nagar) డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. చంద్రశేఖర్ తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు. తానుపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయడు. చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భవతిగా ఉంది. చంద్రశేఖర్‌ మృతితో విషాదం నెలకొంది. తమను బతికించి తాను ప్రాణాలు త్యాగం చేశాడని చంద్రశేఖర్‌ సోదరులు, మరో ఇద్దరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story