Chevireddy Bail: అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి బెయిల్
Chevireddy Bail: అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి బెయిల్

అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి బెయిల్
బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
జూన్ 18, 2025న చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
226 రోజులు జైల్లో ఉన్న చెవిరెడ్డి
వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టు ఊరట కలిగించింది. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం చెవిరెడ్డికి బెయిల్ మంజూరు సింది. భాస్కర్‌రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్‌నాయుడులకు కూడా బెయిల్ ఇచ్చింది. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని.. ఇందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్ర కూడా ఉందంటూ జూన్17వ తేదీన సిట్ బెంగుళూరులో అరెస్ట్ చేశారు. ఇది కూటమి ప్రభుత్వ కుట్రేనని వైసీపీ నేతలు చెప్పారు. ఈ క్రమంలో అనారోగ్యంతో భాధపడుతున్నప్పటికీ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టింది. చివరకు 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ ద్వారా ఉపశమనం లభించింది.


