Chevireddy Mohit Reddy : తుడా ఛైర్మెన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ఛైర్మెన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ ప్రక్రియ సాగింది. శనివారం తుడా కార్యాలయంకు చేరుకున్న మోహిత్ రెడ్డికి వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, ఇతర విభాగాధిపతులు ఘనంగా స్వాగతం పలికారు.

Chevireddy Mohit Reddy took charge as TUDA Chairman
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(Tirupati Urban Development Authority) ఛైర్మెన్ (TUDA Chairman) గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(Chevireddy Mohit Reddy) నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ ప్రక్రియ సాగింది. శనివారం తుడా కార్యాలయంకు చేరుకున్న మోహిత్ రెడ్డికి వీసీ హరికృష్ణ(VC Harikrishna), సెక్రటరీ లక్ష్మీ(Lakshmi), ఇతర విభాగాధిపతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఛైర్మెన్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ, సెక్రటరీ, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తుడా అధికారులు, సిబ్బందితో పరిచయ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తుడా ప్రతిష్టను ఇనుమడింప చేసేలా పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఎంతో నమ్మకంతో తుడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన(CM Jagan)న్న కు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy)కి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేశారు.
