AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో భారీ షాక్
AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో భారీ షాక్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసుల ఉపసంహరణలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై హైకోర్టులో వాడి వేడి వాదనలు వినిపించిన మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్. చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ఏసీబీ న్యాయస్థానంలో ఫైనల్ రిపోర్టు దాఖలు చేసిన ఏపీ సిఐడి. ఏపీ సిఐడి దాఖలు చేసిన ఫైనల్ రిపోర్టు అంగీకరిస్తూ కేసులను మూసివేసిన ఏసీబీ న్యాయమూర్తి. ఏపీ సిఐడి పోలీసులు ఫైండ్ చేసిన ఫైనల్ రిపోర్ట్, ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన మాజీ రైల్వే ఉద్యోగి మేము కొండలరావు. కేసులు ఉపసంహరణ విషయంలో మూడవ పార్టీ అయిన కారణంగా ఏ విధమైన ఉత్తర్వులు ఇవ్వలేమన్న ఏసీబీ న్యాయస్థానం. ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన పిటీషనర్ వేము కొండలరావు. వేము కొండలరావు వేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాడీ వేడి వాదనలు. పిటీషనర్ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ప్రజా ప్రతినిధులు విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉన్నప్పటికీ ఏసీబీ న్యాయస్థానం హడావుడిగా కేసును మూసివేసిందని పిటీషనర్ వాదనలు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ ప్రజాప్రతినిధులు కేసులు విచారించడానికి విజయవాడలో ఉన్న కోర్టు మాత్రమే సిఐడి పోలీసులు వేసిన రిపోర్టుపై ఉత్తర్వులు ఇవ్వాలి అన్న జడ శ్రవణ్. తమ పరిధి కాకపోయినా ఏసీబీ న్యాయస్థానం హడావుడిగా ఉత్తర్వులు ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై కేసులు ఉపసంహరించారు అన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. రిపోర్టు పెట్టిన వెంటనే మెజిస్ట్రేట్ దగ్గర సీఆర్పీసీ-164 వాంగ్మూలం ఇచ్చినప్పటికీ అవి పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ న్యాయమూర్తి కేసును మూసివేశారని పిటిషన్ పేర్కొన్నారు.
ఏపీ సీఐడీ హడావుడిగా ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్ట్‌ను ఏసీబీ న్యాయస్థానం చట్ట వ్యతిరేకంగా అంగీకరించిందన్న పిటిషనర్. ముఖ్యమంత్రి హోదాలో వేలకోట్ల రూపాయలు దోచుకున్నారు అన్న ఆరోపణలు ఉన్న వ్యక్తిపై గంటల వ్యవధిలో కేసులు మూసివేయడం చట్ట విరుద్ధం అని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు. ముఖ్యమంత్రిగా ప్రజల ఆస్తులను కాపాడాల్సిన వ్యక్తులు వేలకోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తే అధికారంలోకి రాగానే కేసులు మూసి వేయటం చట్ట వ్యతిరేకం అన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.
దీంతో న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనాలతో ఏకీభవించిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి. కేసులు ఎందుకు మూసివేసారో తక్షణం వివరాలు సమర్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదిని న్యాయమూర్తి ఆదేశించారు. ఏ సందర్భంలో కేసులు మూసివేసామో పూర్తి వివరాలు సమర్పించడానికి సమయం కావాలని కోర్టును కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది. పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా వేసిన హైకోర్టు.


