Clash Between TDP and Janasena : జనసేనకు టీడీపీ ఝలక్..! విశాఖలో ఏం జరిగిందంటే..!
అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఈవెంట్‌లో జనసేన నాయకులు, క్యాడర్ ఆసక్తి చూపలేదని

అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఈవెంట్‌లో జనసేన నాయకులు, క్యాడర్ ఆసక్తి చూపలేదని, పవన్ కల్యాణ్(Pawan Kalyan) నుంచి ఎలాంటి సూచనలు లేకపోవడంతో జనసేన (Janasena)కార్యకర్తలు దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. మొదటి ఆహ్వాన పత్రికలో పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే ఆ పత్రికను సవరించారని సమాచారం. ఇది రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు. విశాఖ (Visakha)వన్ టౌన్‌లో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ(Vamshi Krishna), టీడీపీ (TDP)ఇన్‌ఛార్జ్ సీతమరాజు సుధాకర్(Seethamaraju Sudhakar)మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని తెలుస్తోంది. ఈ వివాదం కూటమి ఐక్యతకు ముప్పు తెచ్చే స్థాయిలో ఉందని, రెండు పార్టీల సీనియర్ నాయకులు, క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల పంపకాల్లో జనసేనకు అన్యాయం జరిగిందని జనసేన క్యాడర్‌లో అసంతృప్తి నెలకొంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పింది. తాజాగా జీవీఎంసీ (GVMC)డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదాకు ఈ విభేదాలే కారణమని అనుమానిస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇవ్వడంతో కొందరు టీడీపీ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈరోజు నిర్వహించాలని కలెక్టర్ ప్రయత్నించగా కోరం లేక వాయిదా పడడం గమనార్హం. కొందరు టీడీపీ సభ్యులు గైర్హాజరుకావడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
