కడప జిల్లా బద్వేల్‌లో(Badvel) జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కదిలించింది.

కడప జిల్లా బద్వేల్‌లో(Badvel) జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కదిలించింది. విఘ్నేష్‌ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ( Inter Student) ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడం ఆవేదన కలిగిస్తు్న్నదని ఎక్స్‌లో తెలిపారు చంద్రబాబు. వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే, హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమేనని చంద్రబాబు అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story