ఏపీలో(Amdhhra Pradesh) కొత్త మద్యం పాలసీకి(Liquor policy) కసరత్తు ప్రారంభమైంది.

ఏపీలో(Amdhhra Pradesh) కొత్త మద్యం పాలసీకి(Liquor policy) కసరత్తు ప్రారంభమైంది. వైసీపీ హయాంలో చేసిన మద్యం పాలసీకి మంగళం పాడి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాల మద్యం విధానాలపై నాలుగు బృందాలు ఏర్పడి అధ్యయనం చేస్తాయి. ఒక్కో బృందంలో ముగ్గురు అధికారుల చొప్పన ఉన్నారు. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో అధ్యనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. నివేదిక ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు తెలంగాణ, ఏపీ ఒకే తరహా పాలసీని అవలంభించాయి. మద్యం షాపులకు టెండర్లు(wine shop) నిర్వహించి లాటరీ ద్వారా(Lottery) షాపులను కేటాయించేవారు. ఏడాదికి ఫీజులు వసూలు చేసేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నడిచాయి. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి. కొత్త కొత్త రకాల బ్రాండ్లు, బ్రాందీలు, షాపుల్లో నగదు ఉంటేనే మద్యం ఇవ్వడం వంటి చర్యలతో మందుబాబులు జగన్‌ సర్కార్‌పై పగబట్టినట్లే పట్టి ఈ సారి ఓట్లు అటువైపు గుద్దారు. చంద్రబాబు కూడా మేం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెప్పడంతో వారంతా అటు మొగ్గుచూపారని రాజకీయవిశ్లేషకులు భావించారు. ప్రభుత్వ అధికారుల నివేదిక తర్వాత కొత్త మద్యం పాలసీని అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story