ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఎన్నిక‌ల‌లో గెలిచిన త‌ర్వాత తొలిసారి కుప్పం వెళుతున్న ఆయ‌న‌.. రెండు రోజులపాటు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం అయిన తర్వాత కుప్పంకు తొలిసారిగా చంద్రబాబు వస్తుండడంతో టీడీపీ నేతలు కూడా ఘన స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు.

ఇదిలావుంటే.. చంద్రబాబు గురువారం రాజధాని అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. అక్క‌డ రాజధాని అభివృద్ధి పనుల స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. 2019లో అప్ప‌టి సీఎం జగన్ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక నుంచి సీఎం తన పర్యటనను ప్రారంభించారు. హిరోషిమా, నాగసాకిలను ప్రజలు గుర్తుపెట్టుకున్నట్లే జగన్‌మోహన్‌రెడ్డి విధ్వంసక పాలనను ప్రజలు గుర్తుంచుకునేలా ప్రజావేదిక శిథిలాలను ప్రభుత్వం అలాగే ఉంచుతుందని అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story