Why AP Needs Jagan program : వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్(YCP Needs Jagan) కార్యక్రమం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) వెల్లడించారు. సోమవారం విజయవాడ లో వైఎస్సార్‌సీపీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలో చెప్పే కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అన్నారు. గ్రామస్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి మీరంతా కూడా శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

Why AP Needs Jagan program
నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్(Why AP Needs Jagan) కార్యక్రమం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) వెల్లడించారు. సోమవారం విజయవాడ లో వైఎస్సార్‌సీపీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలో చెప్పే కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అన్నారు. గ్రామస్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి మీరంతా కూడా శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్ రావాలి. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10వరకూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వైఎస్సార్‌సీపీ తప్ప ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే లేదని, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని, వ్యాధి సోకిన వారికి తగిన చికిత్స ఇచ్చేందుకు సురక్ష పథకం(Suraksha Scheme) తెచ్చామన్నారు. 15వేల హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, సురక్ష ద్వారా కోటి 65 లక్షల ఇళ్లను కవర్ చేస్తున్నామని చెప్పారు.
31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని, 22 లక్షల ఇళ్లు అక్క చెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయన్నారు. ఇందులో 80శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేదరికంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అక్క చెల్లెమ్మల సాధికారతకు కృషి చేశామని, నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చామని, స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకూ సామాజిక న్యాయం చేశామని చెప్పారు. వైఎస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నామని, సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామని, రూ. 2లక్షల 35వేల కోట్లు డీబీటీ ద్వారా అందించామని తెలిపారు.
ఈరోజు ఇక్కడకు వచ్చిన వారంతా నా కుటుంబ సభ్యులే. పార్టీ గుర్తు మీద ఎన్నికైన మండలి స్థాయి, ఆపై ఎన్నికైన వారందరికీ మీ తమ్ముడిగా, మీ అన్నగా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ ఈ మీటింగ్‌కు రాలేకపోయినా గ్రామస్థాయిలో ఉన్న ఎంపీటీసులు, సర్పంచ్‌లు, తదితరులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అధికారాన్నిప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నాం. ప్రజలకు సేవకుడిగా సేవలందించాను కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాం. మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు ఏర్పాటు అని వివరించారు.
