CM Jagan : రేపు ఆ రెండు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు

CM Jagan Tomorrow Schedule
సీఎం వైఎస్ జగన్(CM Jagan) రేపు విజయవాడ(Vijayawada) ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు సీఎం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత ప్రసంగం ఉంటుంది. అనంతరం పోలీస్ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి(Thadepalli) నివాసానికి చేరుకుంటారు.
ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్(Raj Bhavan)కు చేరుకుంటారు, అక్కడ గవర్నర్‌ను కలిసిన అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుంటారు, అక్కడ ఏపీ హైకోర్టు నూతన జడ్జిల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
