CM Jagan Visited Vizianagaram : విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం
విజయనగరం(Vizianagaram) జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం జగన్ ముందు ప్రమాదస్థలం వద్దకు వెళ్దామనుకున్నారు.

CM Jagan Visited Vizianagaram
విజయనగరం(Vizianagaram) జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం జగన్ ముందు ప్రమాదస్థలం వద్దకు వెళ్దామనుకున్నారు. అయితే.. ట్రాక్ పునరుద్ధరణ, మరమ్మతులు కారణంగా ఘటనా స్థలం వద్ద సందర్శనను రద్దుచేసుకోవాలని రైల్వే అధికారులు సీఎంను కోరారు. దీంతో నేరుగా ఆస్పత్రికి వెళ్లి రైలు ప్రమాదంలో గాయపడ్డవారిని సీఎం పరామర్శించారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు.
