CM Jagan : సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా
సీఎం వైఎస్ జగన్ తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పర్యటన రద్దైంది. భారీ వర్షం కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ రోజు జరగాల్సిన సీఎం జగన్ పర్యటన..

CM Jagan’s visit to Sullurupeta postponed
సీఎం వైఎస్ జగన్(CM Jagan) తిరుపతి(Tirupathi) జిల్లా సూళ్ళూరుపేట(Sullurupeta) పర్యటన రద్దైంది. భారీ వర్షం(Heavy Rain) కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ రోజు జరగాల్సిన సీఎం జగన్ పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం(CMO Office) ప్రకటన విడుదల చేసింది.
పర్యటనలో భాగంగా తడ(Tada) మండలం మాంబట్టు(Mambattu) ఎస్‌ఈజెడ్(SEZ) వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణం నుంచి సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సివుంది. అనంతరం బహిరంగ సభలో కూడా ప్రసంగించేవారు. అయితే వర్షం కారణంగా పర్యటన వాయిదా పడింది. రీషెడ్యూల్(ReSchedule) డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
