AP Politics : సీఎం జగన్ పర్యటన ఎక్కడంటే.. చంద్రబాబు నాయుడు వెళ్ళేది ఇక్కడికే
ఎన్నికల ప్రచారంలో భాగంగా బడా నాయకులు చాలా బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నాడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు

CM Jagan’s visit to three constituencies today
ఎన్నికల ప్రచారంలో భాగంగా బడా నాయకులు చాలా బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నాడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్‌లో జరిగే సభకు సీఎం జగన్ హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగే ప్రజాగళం సభలో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు దర్శి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే కాకుండా.. మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించబోతున్నారు సీఎం జగన్.
