సీఎం చంద్రబాబు నాయుడు బుధ‌వారం విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగారు.

సీఎం చంద్రబాబు నాయుడు బుధ‌వారం విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగారు. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును సీఎం ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను చంద్రబాబు దగ్గరకు పిలిచి మాట్లాడారు. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story