Jagananna Vasathi Deevena : నేడు జగనన్న వసతి దీవెన ఆర్థిక సాయం విడుదల
సీఎం జగన్ నేడు అనంతపురం జిల్లా నార్పలలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జగనన్న వసతి దీవెన ఆర్థిక సాయం విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేయనున్నారు.

CM YS Jagan will release funds of rs 912.71 crore under Jagannanna Vasathi Devena
సీఎం జగన్(CM Jagan) నేడు అనంతపురం(Ananthapuram) జిల్లా నార్పల(Narpala)లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జగనన్న వసతి దీవెన(Jagananna Vasthi Deevena) ఆర్థిక సాయం విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేయనున్నారు. అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.
నేడు జమ చేస్తున్న రూ. 912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2017 సంవత్సరం బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి.. జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Devena), జగనన్న వసతి దీవెన క్రింద ఇప్పటివరకు ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 14,223.60 కోట్లకు చేరింది.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ప్రభుత్వం ఆర్ధికసాయం అందజేస్తుంది. ఐటీఐ(ITI) విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్(Polytechnic) విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ(Degree), ఇంజినీరింగ్(Engineering), మెడిసిన్(Medicine) తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తుంది. కుటుంబంలో ఎంతమంది చదివితే అంతమందికి.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తుంది ప్రభుత్వం.
