ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawan kalyan) సినిమాలలో పాత్రలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawan kalyan) సినిమాలలో పాత్రలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చేస్తే చేశారు కానీ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను(Allu Arjun) ఉద్దేశించి చేసినట్టుగా అనిపిస్తున్నాయి. బన్నీ అభిమానులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఏమన్నారంటే 'ఒకప్పుడు హీరోలు అడవులు కాపాడే పాత్రలు చేశారు. ఇప్పుడు స్మగ్లింగ్‌(Smugling) చేసే పాత్రలు చేస్తున్నారు' అని! పుష్ప(Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ వేసిన క్యారెక్టర్‌ స్మగ్లర్‌దే కదా! ఎర్రచందనాన్ని స్మగ్లింగ్‌ చేసే యాంటీ హీరోగా బన్నీ వేశాడు కదా! కచ్చితంగా ఇది బన్నీని ఉద్దేశించి చేసినవేనని ఫిల్మ్‌ వర్గాలు కూడా అంటున్నాయి. పవన్‌కు, బన్నీకి మధ్య అసలు పడటం లేదనే టాక్‌ కూడా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో ప్రచారం కోసం పవన్ పోటీ చేసిన పిఠాపురం(Pithapuram) నియోజకవర్గానికి వెళ్లలేదు కానీ వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్లారు అల్లు అర్జున్‌. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే పవన్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారేమో!

Updated On
Eha Tv

Eha Tv

Next Story