ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై(YSRCP Leaders) విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై(YSRCP Leaders) విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూపై(Tirumala Laddu) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి(Ponnavolu sudhakar reddy) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం చెందారు. సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు ఒళ్లు జాగ్రత్త పెట్టుకోవాలని, పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. ఇలాంటి విషయాలపై మాట్లాడకుండా నోరుమూసుకుని ఉండటం ఉత్తమమని చెప్పారు. 'నాపై విమర్శలు కాదు. అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యత ఏమిటి? లడ్డూ ప్రసాదం అపవిత్రం అయ్యిందని ఆవేదన చెందుతుంటే, వైసీపీ నేతలు ఏమో బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. విమర్శించే నేతలకు చెబుతున్నా.. సనాతన ధర్మం జోలికి రావొద్దు.. తప్పు జరిగితే ఒప్పుకోండి. లేకపోతే సంబంధం లేదని చెప్పండి. అంతేకానీ ఇష్టానికి మాట్లాడితే ఊరుకునేది లేదు' అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story