ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పర్యటించిన ఆయన కీలక అంశాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పర్యటించిన ఆయన కీలక అంశాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వరుస అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలపై స్థానికులు అడిగిన ప్రశ్నకు ఆవేశంగా స్పందించారు. తాను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని పవన్ హెచ్చరించారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా తాను బాద్యతలు తీసుకుంటానన్నారు. శాంతిభద్రతలపై హోంమంత్రి అనిత రివ్యూ చేయాలని చెప్పారు. శాంతిభద్రతలు చాలా ముఖ్యమైనవని పోలీసులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఆడ పిల్లలపై అత్యాచారాలు చేస్తే కులం ఎందుకు వస్తుందని పవన్ ప్రశ్నించారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నడుచుకోవాలని పోలీసులను ఆదేశించారు. తెగేవరకు లాగకండని ప్రత్యర్థులను పవన్‌ హెచ్చరించారు.

Updated On
ehatv

ehatv

Next Story