ఈనెల 23వ తేదీన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా పర్యటన‌కు వెళ్ల‌నున్నారు

ఈనెల 23వ తేదీన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా పర్యటన‌కు వెళ్ల‌నున్నారు. జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు, రాజంపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

రేణిగుంట విమానాశ్రయం నుండి పవన్ కళ్యాణ్ నేరుగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరా వారి పల్లి చేరుకుంటారు. మైసూర వారి పల్లెలో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన రాజంపేట నియోజకవర్గం చేరుకుంటారు. అక్క‌డ అన్నమయ్య ప్రాజెక్టు, పులపత్తూరు గ్రామాలను పరిశీలిస్తారు. తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని గన్నవరం వెళ్తారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story