రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ' రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. గత అవినీతి, నేర పాలన నుంచి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొంతకాలం క్రితం, విశాఖపట్నం ఓడరేవులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందనడానికి ఇదే నిదర్శనం' అని పవన్‌ ట్వీట్ చేశారు

Updated On
ehatv

ehatv

Next Story