వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) పాలనలో దేవాలయాలు(Temples) ధ్వంసమయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawankalyan) విమర్శించారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) పాలనలో దేవాలయాలు(Temples) ధ్వంసమయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawankalyan) విమర్శించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ(Tirumala laddu) ప్రసాదంలో జంతు అవశేషాలు(Animals fats), చేప నూనె కలిపి అపవిత్రం చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పవన్‌ అన్నారు. అందుకు నిరసనగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతరా వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో రథాలను తగులబెట్టారని, ఆలయాలను అపవిత్రం చేశారని ఆరోపించారు. ఏ మతమైనా సరే వారి మనోభావాలు దెబ్బకూడదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సంస్కరణల పేరుతో 2019 నుంచి గత ప్రభుత్వం చాలా మార్పులు తీసుకొచ్చిందని చెబుతూ తిరుమల శ్రీవారి పూజా విధానాలను సైతం మార్చేశారని విమర్శించారు. శ్రీవాణి ట్రస్టు(sri vani trust) పేరుతో 10వేల రూపాయలు వసూలు చేసి.. బిల్లు మాత్రం 500 రూపాయలకే ఇచ్చారని మండిపడ్డారు. మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూను కూడా కల్తీ చేశారని తెలిసి ఆవేదన కలుగుతోందని పవన్‌ అన్నారు. చర్చిలో, మసీదులో ఇలా జరిగితే జగన్‌ ఊరుకుంటారా అని పవన్‌ ప్రశ్నించారు. హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనకేసుకొస్తున్నారని నిలదీశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story