తిరుమలలో మరో అపచారం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు రావడం చర్చనీయాంశమైంది.

తిరుమలలో మరో అపచారం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు రావడం చర్చనీయాంశమైంది. ఈ భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలు ధరించి వచ్చారు. అయితే ఇక్కడ టీటీడీ విజిలెన్స్‌(TTD vigilance) అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. ప్రాంతాలలో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు వీరిని గుర్తించకపోవడం గమనార్హం. పుణ్యక్షేత్రం తిరుమలో భద్రతాలోపం మరోసారి బయటకు వచ్చింది. భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని మహా ద్వారం వరకు రావడం అధికార నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి భక్తులు వచ్చి పాదరక్షలు ధరించి మహా ద్వారం వరకు చేరుకున్నారు. వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా తీరు, టీటీడీ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story