యూ ట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ(Dhruv rathee) గురించి తెలియనివారు ఉండరు.

యూ ట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ(Dhruv rathee) గురించి తెలియనివారు ఉండరు. తన వీడియోలతో సమకాలీన రాజకీయ(Politics), సామాజిక అంశాలపై నిర్భయంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. ఇప్పుడాయన తిరుమల లడ్డూపై(Tirumala laddu) కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేవ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై(Pawan kalyan) కూడా సెటైర్లు విసిరారు. పవన్‌ కల్యాణ్‌ మంచి నటుడు అంటూ దెప్పిపొడుస్తూ ' హిందూ మతానికి(Hinduism) చెందిన ఇద్దరు పెళ్లాలను వదిలేసి, క్రిస్టియన్‌ అమ్మాయిని(christian) పెళ్లి చేసుకున్న పవన్‌ నిజంగానే సనాతన యోధుడు. ఆయను చూసి గర్వపడాలి' అంటూ ధ్రువ్‌ రాతీ కామెంట్ చేశారు. పవన్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షపై కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు ధ్రువ్‌.. పవన్‌ 11 రోజులు ఉపవాస దీక్ష చేసినా, 11 ఏళ్లు ఉపవాస దీక్ష చేసినా ఏం జరుగుతుంది? ఏమీ జరగదు అని ధ్రువ్‌ తన ఎక్స్‌ ఖాతా ద్వారా కామెంట్‌ చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని అడ్డం పెట్టుకుని పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో హిందూ-ముస్లింల విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా చెప్పుకొచ్చారు ధ్రువ్‌! రెండు రూపాయల అంధభక్తులకు మాత్రం పవన్‌లో ఓ సెక్యూలర్‌ సనాతని కనిపిస్తారని, అన్ని మతాలకు గౌరవాన్ని ఇచ్చే వ్యక్తిగా వారికి కనిపిస్తాడని వ్యాఖ్యానించారు ధ్రువ్‌. మొత్తంగా గత మూడు రోజులుగా పవన్‌ కల్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు ధ్రువ్‌!

Updated On
Eha Tv

Eha Tv

Next Story