మాధురి నన్ను అమ్మలా చూసుకుంది

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌(YCP) పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(Duvvada Srinivas) కుటుంబ వ్యవహారాన్ని నిరంతరంగా మీడియా ప్రసారం చేస్తున్నాయి. స్టోరీలకు స్టోరీలకు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన భార్య వాణి(Duvvada vani), ఫ్రెండ్‌ దివ్వెల మాధురి(Divvela madhuri) మాత్రమే తెరమీదకు వచ్చారు. ఇప్పుడు మాధురి భర్త దివ్వెల మహేశ్‌ చంద్ర(Mahesh chandra) కూడా వచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, మాధురి ఇష్టపడటంతో తాను తెలుగుదేశంపార్టీ అభిమానినే అయినప్పటికీ ఆమెను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ఒప్పుకున్నానని మహేశ్‌ చంద్ర చెప్పారు.

తన భార్యపై పూర్తి నమ్మకం ఉందని, ఆమె రాజకీయంగా ఎదుగుతుందని కారణంతో ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మాధురి చాలా మంచి అమ్మాయి అంటూ భార్యకు మద్దతు పలికారు. మాధురి మంచి డ్యాన్సర్‌ అని, ఆమె చేస్తున్న డ్యాన్సుల గురించి కూడా తప్పుడు కూతలు కూస్తున్నారని తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురికి త‌న‌కు ఓ మంచి ఫ్రెండ్ అని.. ఈ విష‌యంలో ఎవ‌రు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా తాను మాధురి పక్షానే నిలబడతానని మహేశ్‌ చంద్ర తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story