విజయవాడ నగరంలో ఈరోజు జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయవాడ నగరంలో ఈరోజు జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో ఉన్న ఒక యువ జంట నడిరోడ్డుపై బైక్‌పై అనుచితంగా ప్రవర్తిస్తూ రొమాన్స్ చేసుకున్న దృశ్యాలు కెమెరాలో బంధించబడ్డాయి. ఈ ఘటన విజయవాడ(Vijayawada)లోని రామలింగేశ్వర నగర్ ఫ్లైఓవర్‌పై ఒక యువకుడు తన స్నేహితురాలిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని, మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రయాణించాడు. వీరి అనుచిత ప్రవర్తనను వెనుకవైపు వస్తున్న ఒక వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఈ దృశ్యాలు వేగంగా వైరల్ అయ్యాయి. వీడియోలో జంట బహిరంగంగా రొమాన్స్‌లో మునిగిపోయి, రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ కనిపించారు.

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, విజయవాడ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఫిర్యాదు అందిన వెంటనే, పోలీసులు ఈ జంటను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. మద్యం మత్తులో వాహనం నడపడం, అనుచిత ప్రవర్తన, రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై వీరిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై ఇలాంటి అసభ్యకర ప్రవర్తన సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని, ఇది ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తుందని సోషల్ మీడియాలో అనేక మంది వ్యాఖ్యానించారు. కొందరు ఈ జంటపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, మరికొందరు యువతలో మద్యం వినియోగం పెరుగుతున్న ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు

ehatv

ehatv

Next Story