భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెసులుబాటు కల్పించారు

భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని సీఎం సూచించారు. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్ర‌బాబు సూచించారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story