Dwaraka Tirumala Rao as AP DGP

ఏపీ కొత్త‌ డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ఆయ‌న‌ను ప్రభుత్వం డీజీపీగా నియమిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ద్వారకా తిరుమలరావు నియామ‌కానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సీఎస్) నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్త‌ర్వుల్లో తెలిపారు.

ఇదిలావుంటే.. 2021 జూన్ నెలలో ఏపీఎస్ ఆర్‌టీసీ ఎండీగా నియమితులైన‌ ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. అంతకుముందు ఆయ‌న విజయవాడ సీపీగా.. రైల్వే శాఖలో డీజీపీగా ప‌ని చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ హరీష్ కుమార్ గుప్తాకు అవ‌కాశం ద‌క్కింది. తాజాగా ద్వారకా తిరుమలరావుకు ఏపీ పోలీసు బాస్ పీఠం ద‌క్కింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story