Pemmasani Chandrasekhar : గుంటూరు టీడీపీ లోక్‌సభ అభ్యర్థికి ఈసీ నోటీసులు
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌వో) ఎం.గంగరాజు నోటీసు పంపారు.

EC slaps notice on Guntur TDP Lok Sabha nominee for comparison of YSRCP with Saddam Hussein
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌వో) ఎం.గంగరాజు నోటీసు పంపారు. మార్చి 25న నియోజకవర్గంలోని లామ్ గ్రామంలో జరిగిన ప్రచార సభలో పెమ్మసాని వైఎస్సార్‌సీపీ నేతలను సద్దాం హుస్సేన్‌తో పోల్చారు.
'వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు సద్దాం హుస్సేన్‌లా ప్రవర్తిస్తున్నారు. సద్దాం హుస్సేన్ కూడా నిరంకుశంగా ప్రవర్తించినందున.. అతన్ని బంకర్ నుండి బయటకు లాగి కుక్కలా నిర్దాక్షిణ్యంగా చంపారు, ”అని పెమ్మసాని అన్నారు. దీనిపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ నాగుల్‌మీరా తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. నోటీసును అందజేస్తూ.. శుక్రవారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని చంద్రశేఖర్‌ను ఆర్‌ఓ కోరారు.
