ఎన్నికల సంఘం(Election Commission)వ్యవహార శైలి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డికే(EX MLA Balineni Srinivas Reddy) కాదు, ఈసీ(EC)తీరు సాధారణ ప్రజలకు కూడా సందేహలు కలిగిస్తోంది.

ఎన్నికల సంఘం(Election Commission)వ్యవహార శైలి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డికే(EX MLA Balineni Srinivas Reddy) కాదు, ఈసీ(EC)తీరు సాధారణ ప్రజలకు కూడా సందేహలు కలిగిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తను ఓడిపోవడం కంటే వైసీపీ(YCP)కి బలం ఉన్న చోట కూడా టీడీపీ(TDP)కి మెజారిటీ రావడమే బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఆశ్చర్యం కలిగించింది. ఏదో జరిగే ఉంటుందని అయన అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో చాలా చోట్ల ఇలాగే జరిగింది. కేతిరెడ్డి(Keethi Reddy) ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చాలా మందికి అనుమానాలు వచ్చాయి. ఇక లాభం లేదనుకున్న బాలినేని వీవీ పాట్స్‌(VV Pads)ను లెక్కించాల్సిందేనని డిసైడయ్యారు. 12 పోలింగ్‌ బూత్‌(Polling Booth)లపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ వాటిలో లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకోసం 5.66 లక్షల రూపాయలు కూడా చెల్లించారు. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఇది కుదరదనేసింది. కేవలం మాక్‌ పోలింగ్‌ (Mock Polling) మాత్రమే చేస్తామని చెప్పింది. దాంతో బాలినేని మళ్లీ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వీవీ ప్యాట్స్‌ను లెక్కించడానికి ఈసీకి వచ్చిన ఇబ్బంది ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈవీఎంలలో ఏదో మతలబు ఉండింది కాబట్టే ఎన్నికల సంఘం ఇలా వ్యవవహరిస్తోందన్న అనుమానం కలుగుతోంది. బాలినేని కోరుకున్నట్టుగా వీవీ పాట్లను లెక్కిస్తే సరిపోతుంది కదా! ఆ పని ఈసీ ఎందుకు చేయడం లేదు? మాక్‌ పోలింగ్‌ వల్ల ఆవగింజ ప్రయోజనం కూడా ఉండదు. ఇది అందరికి తెలిసిన విషయమే. మాక్‌ పోలింగ్‌ చేయాలని ఈసీ ఎందుకు అనుకుంటోంది? దాని వల్ల ఒనగూడే ప్రయోజనం ఏముంటుంది? వీవీ ప్యాట్స్‌ కనక లెక్కించకపోతే మాత్రం మొన్నటి ఎన్నికల్లో ఏదో జరిగే ఉంటుందన్న అనుమానాలు మరింత బలపడతాయి. వీవీ ప్యాట్స్‌ లెక్కిస్తే అటో ఇటో తేలిపోతుంది కదా! ఈసీ ఎందుకు వెనకంజ వేస్తున్నదో ఎవరికీ తెలియడం లేదు!

Updated On
ehatv

ehatv

Next Story