ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. బీ.ఫార్మసీ విద్యార్థిని మైథిలీ ప్రియను, ఆమె మాజీ ప్రియుడు నిఖిల్ కత్తితో అత్యంత క్రూరంగా చంపాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీసు సెంటర్ సమీపంలో జరిగింది.

మైథిలీ ప్రియ బెంగళూరు నుంచి నెల్లూరు వచ్చి 10 రోజులు అయింది. మైథిలీ ప్రియ బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందినవాళ్లు, బీ.ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసి, బెంగళూరులో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విద్యాభ్యాస సమయంలో రాపూరు మండలానికి చెందిన నిఖిల్‌ను ప్రేమించింది. అయితే నిఖిల్ మాట్లాడాలని చెప్పి, కరెంట్ ఆఫీసు సెంటర్ వద్దకు రమ్మన్నాడు. అక్కడ ఆమెతో గొడవ జరిగింది దీంతో కోపంతో కత్తితో ఆమెను అనేకసార్లు పొడిచి చంపాడు. హత్య తర్వాత, నిఖిల్ మైథిలీ ప్రియ సోదరి సాహితీకి ఫోన్ చేసి, "మా మధ్య గొడవ జరిగింది, కత్తితో పొడిచి చంపేశాను" అని చెప్పాడు. అనంతరం దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయాడు. నిఖిల్‌పై IPC సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. మైథిలీ ప్రియ కుటుంబ సభ్యులు, స్నేహితులు నిఖిల్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మైథిలీ ప్రియ మరణంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దుఃఖంలో మునిగారు.

ehatv

ehatv

Next Story