Krishnapriya Demand To Pawan kalyan : పవన్ కళ్యాణ్ గారూ స్పందించండి.. మాజీమంత్రి నారాయణ తమ్ముడు భార్య
నేను పవన్ కళ్యాణ్(Pawan kalyan) వీరాభిమాని.. అయినా కూడా ఇప్పటివరకు నాకు జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ స్పందించలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ని నేను ప్రశ్నిస్తున్న.. నాకు జరిగిన అన్యాయంపై మీరు స్పందించకపోవడానికి మీకు ఎవరి దగ్గరి నుంచి వత్తిడి వస్తుందో చెప్పాలని అడిగారు. ఈ సారి పవన్ కళ్యాణ్ కు ఓటు వేయని వారిని కుల బహిష్కరణ కూడా చేయాలని తాను గతంలో చెప్పానని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనపై మీరు స్పందించకపోవడం పట్ల మీ మీద కూడా అనుమానం వస్తుందని.. రేపు మీరు సీఎం అయితే ఏం ప్రశ్నిస్తారని.. స్పందించాలని అడిగారు.

Krishnapriya Request To Pawan kalyan
మాజీమంత్రి నారాయణ(Narayana) హాస్పిటల్ లో మహిళా డాక్టర్‌ను సెక్సువల్ గా వేధించాడంటూ ఆయన తమ్ముడు భార్య పొంగూరు ప్రియ మరో సంచలన వీడియో బయటపెట్టారు. నేను కేసు పెట్టినా ఇప్పటివరకూ తెలంగాణ పోలీసులు స్పందించలేదని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులపై ఏ రాజకీయ నాయకులు వత్తిడి తెస్తున్నాని ప్రశ్నించారు.
నేను పవన్ కళ్యాణ్(Pawan kalyan) వీరాభిమాని.. అయినా కూడా ఇప్పటివరకు నాకు జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ స్పందించలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ని నేను ప్రశ్నిస్తున్న.. నాకు జరిగిన అన్యాయంపై మీరు స్పందించకపోవడానికి మీకు ఎవరి దగ్గరి నుంచి వత్తిడి వస్తుందో చెప్పాలని అడిగారు. ఈ సారి పవన్ కళ్యాణ్ కు ఓటు వేయని వారిని కుల బహిష్కరణ కూడా చేయాలని తాను గతంలో చెప్పానని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనపై మీరు స్పందించకపోవడం పట్ల మీ మీద కూడా అనుమానం వస్తుందని.. రేపు మీరు సీఎం అయితే ఏం ప్రశ్నిస్తారని.. స్పందించాలని అడిగారు.
నాకు మెంటల్(Mental Health Problems) అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను నార్కో టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నాను.. నారాయణ గారు మీరు కూడా నార్కో టెస్ట్ కి రండి ఎవరు నిజాలు చెప్తున్నారు అనేది తేలిపోతుందన్నారు.
నారాయణ మెడికల్ హాస్పిటల్‌లో డాక్టర్లను కూడా నారాయణ టార్చర్ చేసి వేధించారని ఆరోపించారు. మెడికల్ కాలేజ్ లో ఒక హార్ట్ సర్జన్‌ను.. అలాగే ఒక న్యూరో స్పెషలిస్ట్ మహిళా డాక్టర్‌ను నారాయణ సెక్సువల్ గా టార్చర్ చేసి వేధించడంతో వారు నారాయణ హాస్పిటల్ లో మానేసి బయటికి వెళ్లిపోయారని వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు.