తనపై నమోదైన‌ లైంగిక వేధింపుల కేసును కొట్టి వేయాలని టీడీపీ బహిష్కృత MLA కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్ర‌యించారు

తనపై నమోదైన‌ లైంగిక వేధింపుల కేసును కొట్టి వేయాలని టీడీపీ బహిష్కృత MLA కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్ర‌యించారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజానిజాలు శోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారు అని ఎంఎల్ఏ పిటీష‌న్‌లో పేర్కొన్నారు. జూలై, ఆగస్టు నెలలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ప్ర‌శ్నించారు. ఈ ఘటనను హనీ ట్రాప్‌గా పిటిషన్‌లో ఆదిమూలం పేర్కొన్నారు. 72 సంవత్సరాల వయస్సులో తాను గుండెకు స్టెంట్ చేయించుకున్నాను అని ఎంఎల్ఏ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని టీడీపీ మహిళా నేత ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 5న పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story