✕
Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
By Eha TvPublished on 6 July 2024 4:03 AM GMT 
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలంలోని కొండ్లవాడ పల్లె వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.

x
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలంలోని కొండ్లవాడ పల్లె వద్ద  ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అవడంతో చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు కడపకు చెందిన వారిగా గుర్తించారు. సమాచార అందుకున్న రామాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Eha Tv
Next Story

