ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) మైకు కనిపిస్తే చాలు పూనకం వచ్చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) మైకు కనిపిస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. ఆవేశం తన్నుకుని వచ్చేస్తుంది. అర్థం పర్థం లేని మాటలు అనర్గళంగా వచ్చేస్తాయి. ఇది చాలా మంది అభిప్రాయం. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రముఖ పర్యావరణ ఉద్యమ నేత పీవీఎస్‌ శర్మ(PVS Sharma) అభిప్రాయం కూడా ఇదే! ఆయన ఎక్స్‌(Twitter) వేదికగా పవన్‌పై ఘాటు విమ్శలు చేశారు. ఇంగ్లీషులో ఆయన చేసిన ట్వీటుకు తెలుగు అనువాదం ఏమిటంటే..

'ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత‌కాలం నోరు మూసుకుని మౌనంగా వుంటే మంచిది. ప‌రిపాల‌న‌ను అర్థం చేసుకోడానికి ప్ర‌య‌త్నించండి. అందులోని ఇబ్బందుల‌ను తెలుసుకోండి. ప‌వ‌న్ త‌న‌కు అర్ధం కాని స‌మ‌స్య‌ల‌పై అప‌రిప‌క్వ‌త‌తో, బాధ్య‌తారాహిత్యంతో ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ ధోర‌ణి అత‌న్ని ప్ర‌జ‌ల్లో న‌వ్వుల‌పాలు చేస్తోంది. ప‌వ‌న్‌కు త‌గిన శిక్ష‌ణ ఇప్పించండి చంద్ర‌బాబు'(Chandrababu) అని ట్వీట్‌ చేశారు పీవీఎస్‌ శర్మ. ఎవరు అవునన్నా, కాదన్నా ఈ ట్వీట్‌ మాత్రం పవన్‌ కల్యాణ్‌ అజ్ఞానాన్ని శర్మ బయటపెట్టినట్టయ్యింది. పవన్‌పై ఈ స్థాయిలో విమర్శలు గుప్పించిన శర్మపై కేసులు పెట్టగలదా ఈ ప్రభుత్వం? ప్రభుత్వంపైనో, చంద్రబాబుపైనో, పవన్‌ కల్యాణ్‌పైనో చిన్నపాటి విమర్శలు చేస్తేనే బొక్కలో తోస్తున్నారు. మరి పవన్‌పై ఈ స్థాయిలో విమర్శలు చేసిన శర్మపై కూడా కేసులు పెడతారా?

Updated On
Eha Tv

Eha Tv

Next Story