Padala Aruna : నేడు జనసేనలో చేరనున్న మాజీమంత్రి
మాజీ మంత్రి పడాల అరుణ గురువారం జనసేనలో చేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పడాల అరుణ రెండేళ్ల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు.

Former Minister Padala Aruna will join Jana Sena today
మాజీ మంత్రి పడాల అరుణ(Padala Aruna) గురువారం జనసేన(Janasena)లో చేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena Chief Pawan Kalyan) సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పడాల అరుణ రెండేళ్ల క్రితం టీడీపీ(TDP)కి రాజీనామా చేశారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఆమె రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని భావించి తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న ఆమె.. ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. పవన్‌తో చర్చించిన ఆమె.. ఈ రోజు ప్రారంభమయ్యే వారాహి యాత్ర(Varahi Yatra)లోజనసేన కండువా కప్పునేందుకు సిద్ధమయ్యారు.
పడాల అరుణ గజపతినగరం(Gajapathinagaram) నియోజకవర్గం నుంచి మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి(MInister)గా కూడా పనిచేశారు. చివరగా టీడీపీ నుంచి 2009లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2021లో టీడీపీకి రాజీనామా చేశారు.
