ఆంధప్రదేశ్‌లో(Andhra Pradesh) కురిసిన భారీ వర్షాలకు(Heavy rains) పలు ప్రాంతాలు నీట మునిగాయి.

ఆంధప్రదేశ్‌లో(Andhra Pradesh) కురిసిన భారీ వర్షాలకు(Heavy rains) పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడలో(Vijayawada) అయితే వరద బీభత్సాన్ని సృష్టించింది. ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. బుడమేరు వాగు సాగించిన విలయం నుంచి బెజవాడ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో నీటిలో మునిగిన తమ ఇళ్లను శుభ్రపరుచుకుంటున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌(YCP) కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత రోజా సెల్వమణి(Roja) ఎక్స్‌లో(Twitter) ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సారాంశమేమిటంటే. ..వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన సంస్కరణలే ఇప్పుడు విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయని, జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు, జగనన్న(YS Jagan) నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన వైఎస్‌ఆర్‌ హెల్త్ సెంటర్లే ప్రస్తుతం విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయని రోజా రాసుకొచ్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story