గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్(Cyber crime) అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ(Vasi reddy padma) తెలిపారు

గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్(Cyber crime) అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ(Vasi reddy padma) తెలిపారు. రాజకీయపరమైన నిర్ణయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని(Keshineni nani) శివనాధ్ చిన్ని తమకు ఆప్తులు అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. త్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మాధవ్ వ్యాఖ్యలపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుని ఇవాళ(శనివారం) కలిసి వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అందరూ ఆశ్చర్యపోయేలా ఉన్నాయని అన్నారు. ఆ ఘటన జరిగినప్పుడు అత్యాచారాలకు గురైన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని అన్నారు. కానీ ఏ మాత్రం అవగాహన లేకుండా అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను గోరంట్ల మాధవ్ నిస్సిగ్గుగా బయటకు చెప్పారని మండిపడ్డారు. ఆ ఘటనకు గురైన బాధితుల పేర్లు చెప్పి మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. మహిళల మీద, అత్యాచార బాధితుల పట్ల సోయిలేకుండా ఒక మాజీ ఎంపీ ఈ విధంగా మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటనకు గురైన బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ కోరారు. అలాంటి వారి మీద ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వైసీపీకి చెందిన కొన్ని చానల్స్ వార్తలు ప్రసారం చేయడం, ఇప్పటికీ తొలగించకపోవడం చూస్తే.. మహిళల పట్ల వైసీపీకి ఉన్న నిబద్దత ఏంటో అర్థం అవుతుందని వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. తన రాజకీయపరమైన నిర్ణయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) తమకు ఆప్తులు అని తెలిపారు. త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story